సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి
అడ్డతీగల: ప్రాచీన సంస్కృత భాషను నేటి తరాలకు అందించవలసి ఉందని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు అన్నారు.అడ్డతీగల మండలం వెదురునగరంలోని విశ్వహిందూ పరిషత్ ఒరియెంటల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంస్కృత భాష ప్రదర్శనను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి అవసరమయ్యే సహాయ సహకారాలను అందిస్తామన్నారు. భాష ప్రదర్శనకు కృషిచేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆయన అభినందించారు. జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ తిరుపతి, గిరిజన సంక్షేమశాఖ డీడీ రుక్మాంగదయ్య, ఎంఈవోలు పాల్గొన్నారు.


