చికిత్స పొందుతూ శిశువు మృతి
రంపచోడవరం: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రస వ సమయంలో గర్భిణి మృతి చెందిన ఘటన లో శిశువుకు కూ డా చనిపోయింది. నరసాపురం గ్రామానికి చెంది కోట బాపనమ్మ ప్రసవం కోసం 12 రోజులు ముందే స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. ఆమెకు 19వ తేదీన ప్రసవం చేయడంతో శిశువుకు జన్మనిచ్చింది. తరువాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. అయితే ప్రసవం జరిగిన రోజే శిశువును మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. శిశువు మూడు రోజులు చికిత్స తరువాత గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


