ఏవోబీలో పోలీసులు అప్రమత్తం
9వ పేజీ తరువాయి
నిలిపివేశారు. బంద్ అనంతరం పునరుద్ధరిస్తామని వారు పేర్కొన్నారు.
చింతూరు: సబ్ డివిజన్ పోలీసులు గురువారం ఎస్‌ఐ పేరూరి రమేష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానితుల పూర్తి వివరాలు సేకరించి పంపించారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ముందస్తుగా చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలను కూనవరం జంక్షన్ మీదుగా, భద్రాచలం వైపు నుంచి చింతూరు వైపు వచ్చే వాహనాలను నెల్లిపాక మీదుగా దారి మళ్లించారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన యంత్రాలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని సూచించారు.
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గురువారం ఎస్‌ఐ రామకృష్ణ వాహన తనిఖీలు చేపట్టారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, డుడుమ మార్గాల్లో వచ్చే వాహనదారుల బ్యాగులు,లాగేజీలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వివరాలు సేకరించి విడిచి పెట్టారు. వాహనాలకు రికార్డులు, లైసెన్సులు లేకపోవడంతో ఫైన్ విధించారు.సీఆర్‌పీఎఫ్ బలగాలు మండల కేంద్రంలో ప్రత్యేక గస్తీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మావోయిస్టులు భారత్ బంద్‌కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, మారుమూల పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించారు. రాత్రి పూట పెట్రోలింగ్ సైతం నిర్వహిస్తామని, ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆయన కోరారు.
జి.మాడుగుల: పాడేరు–జి.మాడుగుల రోడ్డు మార్గంలో పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో వాహనాలను గురువారం సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ షణ్ముఖరావు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించి వదిలి పెట్టారు. రికార్డుల లేని వాహనాలుపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తే తక్షణమే పోలీసులు సమాచారం అందించాలని వారు కోరారు.
కొయ్యూరు:స్టేషన్ సమీపంలో సీఐ శ్రీనివాస్ ఆద్వర్యంలో కొయ్యూరు, మంప ఎస్‌ఐలు కిషోర్ వర్మ, శంకర రావు వాహన తనిఖీలు చేపట్టారు. కొత్త వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని విడిచిపెట్టారు.
అడ్డతీగల: మండలంలోని వేటమామిడి జంక్షన్‌లో సీఐ బి.నరసింహమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేశారు.ప్రధాన కూడళ్లలో నిఘా ఏర్పాటు చేశారు.
మోతుగూడెం: స్థానిక ఎస్‌ఐ సాధిక్ ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది చెక్‌పోస్టు వద్ద వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు.
ఏవోబీలో పోలీసులు అప్రమత్తం
ఏవోబీలో పోలీసులు అప్రమత్తం


