మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తం
ఎస్పీ అమిత్ బర్దర్
జి.మాడుగుల: మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. స్థానిక సర్కిల్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం రాత్రి ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మండలంలో శాంతి భద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పనితీరు సమీక్షించారు.
జనరల్ డైరీ, వివిధ కేసులకు సంబంధించిన డైరీలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 24న మావోయిస్టుల బంద్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఏరియా డామినేషన్, సమాచార సేకరణ, వ్యూహాత్మకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంపై ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.


