ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి కృషి
● డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్
పాడేరు రూరల్: ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి అందరూ కృషి చేయాలని డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్ తెలిపారు. ఎంఎల్‌హెచ్‌పీ కమ్యూనిటీ హెల్త్ అధికారులు, వైద్య సిబ్బందికి బుధవారం పాడేరులో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 297 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో 12 ప్యాకేజీల సర్వీసులు అందించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలపై డిసెంబర్ రెండో వారం వరకు టీముల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న గర్భధారణ, నవజాత శిశువు, బాల్యం, యవ్వన దశల్లో ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ,గర్భ నిరోధక సేవలు, అంటు వ్యాధుల నివారణ, తదితర వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.


