విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
పాడేరు: గిరిజన విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రిన్సిపాళ్లు, ప్రధాన్యోపాధ్యాయులు, ఏటీడబ్ల్యువోలు, ఎంఈవోలతో బుధవా రం అత్యవసర సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పాఠశాలల నిర్వాహకుల ప్రాథమిక బాధ్య తన్నారు. ఉన్నతాధికారుల నుంచి మందలింపులు వస్తాయని భయపడి విద్యార్థుల అనారోగ్య సమస్యలు గోప్యంగా ఉంచవద్దన్నారు. పోషకాహారం లోపం కారణంగా విద్యార్థులకు అనారోగ్య సమస్య లు వస్తాయని చెప్పారు. సిక్‌బోర్డు రిపోర్టును నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రుల నుంచి డిశార్జి అయిన విద్యార్థులను నేరుగా ఇంటికి పంపించకుండా ఉపాధ్యాయులు, వసతిగృహం నిర్వాహకుల పర్యవేక్షణలో పాఠశాలకే తిరిగి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను కేజీహెచ్ తదిత ర ఆస్పత్రులకు పంపినప్పుడు వారి తల్లిదండ్రులు భయపడే అవకాశం ఉన్నందున ఉపాధ్యాయులు పిల్లలకు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలన్నారు. దసరా సెలవుల తర్వాత పాఠశాలల్లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల వివరాలు, హెల్త్ కార్డుల నిర్వహణపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థికి హెల్త్ బుక్ (రికార్డు) నిర్వహించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత తప్పని సరిగా ఉండాలన్నారు. విద్యార్థుల గదులతో పాటు వంటశాలలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ కె.సాహిత్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ తదితరులు పాల్గొన్నారు.
పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ


