మూగబోయిన ఆత్మీయ పలకరింపు
7వ పేజీ తరువాయి
ఆయన సీపీఐని వీడి వైఎస్సార్ సీపీలో చేరా రు. 2021లో వైఎస్సార్‌సీపీ నుంచి మూడో సారి జెడ్పీటీసీగా గెలుపొందారు. ప్రస్తు తం ఆయన జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తూ హత్యకు గురయ్యారు.
ప్రముఖల నివాళి
చిట్టింపాడులో నూకరాజు పార్థివ దేహంపై జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర,పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎంపీ గొడ్డేడి మాధవి, ఎంపీపీ బడుగు రమే ష్, చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఇతర నేతలు పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. నూకరాజును చివరిసారిగా చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నూకరాజు భార్య గంగమ్మ, పెద్ద కూతురు లక్ష్మి, రెండో కూతురు శివలక్ష్మి,కొడుకు కన్నబాబును నాయకులు ఓదార్చారు. అనంతరం నూకరాజు పార్థివ దేహానికి ఆయన పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
నూకరాజు సేవలు చిరస్మరణీయం : జెడ్పీ సీఈవో నారాయణమూర్తి
మహారాణిపేట: కొయ్యూరు మండలం జెడ్‌పీటీసీ వారా నూకరాజు అత్యంత సౌమ్యుడు, నిగర్వి, నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడని జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వహణాధికారి(సీఈవో) పి.నారాయణమూర్తి కొనియాడారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వారా నూకరాజు సంతాప సభ నిర్వహించారు. తొలుత నూకరాజు చిత్రపటానికి సీఈవో పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నూకరాజు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్ మాట్లాడుతూ నూకరాజు మరణం జిల్లా ప్రజా పరిషత్‌కు తీరని లోటు అన్నారు. నూకరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, పరిపాలనాధికారులు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
మూగబోయిన ఆత్మీయ పలకరింపు


