మూగబోయిన ఆత్మీయ పలకరింపు
మిగతా 8వ పేజీలో
కొయ్యూరు: అమ్మా...అయ్యా అంటూ అందర్నీ ఆత్మీయంగా పలకరించే ఆ గొంతు మరి వినిపించదు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే ఆ నాయకుడు అందరికీ దూరమయ్యాడు. 25 సంవత్సరాలుగా రాజకీయల్లో ఉన్న జెడ్పీటీసీ వారా నూకరాజు(59) భూ వివాదంలో దారుణ హత్యకు గురయ్యారు. అతని పార్థివదేహానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామం చిట్టింపాడు తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూడగానే గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభయం ఇచ్చే నాయకుడిని కోల్పోయామంటూ భోరున విలపించారు.
వద్దని వారించినా....
వివాదంలో ఉన్న చటర్జీపురం భూమి వద్దకు వెళ్తానని సోమవారం నూకరాజు చెప్పగానే వద్దని కుటుంబ సభ్యులు వారించారు. ఆయన వెళ్లకుండా కారు తాళం కూడా దాచేశారని స్థానికుల ద్వారా తెలిసింది. అయితే నూకరాజు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తాళం ఇవ్వకుంటే ఆటోలోనైనా వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. దీంతో కారు తాళాలు ఇవ్వవలసి వచ్చింది. ఆయన ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన గంటలోపే మరణించారు.
మూడుసార్లు జెడ్పీటీసీగా..
నూకరాజు మూడు సార్లు జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఇలా మూడుసార్లు జెడ్పీటీసీగాఎన్నికై న వారు మన్యంలో ఇంకెవరూ లేరు. 2001లో జెడ్పీటీసీగా సీపీఐ నుంచి మొదటి సారి గెలుపొందారు. కాంగ్రెస్,టీడీపీకి సమానంగా జెడ్పీటీసీ స్థానాలు రావడంతో సీపీఐ నుంచి గెలుపొందిన నూకరాజు పార్టీ అనుమతితో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. దీంతో వంజంగి కాంతమ్మ చైర్మన్‌గా ఎంపిక కాగా, నూక రాజు వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. రెండోసారి ఆయన 2008లో జెడ్పీటీసీగా గెలుపొందారు. 2015లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం
అభయం ఇచ్చే నేతను కోల్పోయామని ఆవేదన
జెడ్పీటీసీ నూకరాజు
మృతదేహానికి నేతల నివాళి
కన్నీటి పర్యంతమైన ప్రజలు
మూగబోయిన ఆత్మీయ పలకరింపు
మూగబోయిన ఆత్మీయ పలకరింపు


