మెరుగైన వైద్య సేవలుఅందించాలి
● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్
చింతూరు: క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు 12 రకాల ఆరోగ్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. వైద్యసిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఎయిమ్స్–ఐసీఎంఆర్ రీసెర్చ్ కన్సల్టెంట్ శాంతిరాజ్యం పాల్గొన్నారు.


