జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి
పాడేరు : జీఎస్టీ తగ్గింపుతో సామాన్యుల్లో కొనుగోలు శక్తి పెరిగిందని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆకాశ దీపాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ శ్రీపూజ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గడంతో పండగలను ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ దొన్నుదొర, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వాణిజ్య శాఖ ఉప కమిషనర్ పద్మజ, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్లు రమేష్‌కుమార్, నూకరాజు, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు
పాడేరు రూరల్: జీఎస్టీ సంస్కరణలతో అన్నివర్గ ప్రజలకు మేలు జరుగుతుందని వాణిజ్య శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి.రమేష్‌కుమార్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన పోస్టర్‌ను పాడేరు వాణిజ్యశాఖ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ అజీజ్, జీఎస్టీ అధికారులు శేషగిరి నాయుడు, రజినీకాంత్, ప్రసాధ్, ఎగ్జిక్యూటివ్ ట్యాక్స్ అసిస్టెంట్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


