ప్రైవేటీకరణతో వైద్య విద్య దూరం
అరకులోయటౌన్/డుంబ్రిగుడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో సామాన్య, పేద విద్యార్థు లకు వైద్య విద్యకు దూరమవుతుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు.అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్టు, కొర్రాయి పంచాయతీల్లో, అరకులోయ మండలంలోని మాద ల, బొండాం, సుంకరమెట్ట పంచాయతీ కేంద్రాల్లో ఆదివారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. డుంబ్రిగుడ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలిసంతకాన్ని కొర్రాయి ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ లలిత చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించగా, కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తుండడం దారుణమన్నారు. బినామీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన, కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు ఇంటివద్దే సంక్షేమ పథకాలు అందజేస్తే, కూటమి ప్రభుత్వంలో చంద్రబా బు రివర్స్ పాలన సాగిస్తున్నారన్నారు. డుంబ్రిగుడ మండల పర్యటనలో భాగంగా జామంగు ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు నాణమైన భోజనం అందించాలని అక్కడి డిప్యూటీ వార్డెన్‌కు సూచించారు. అనంతరం కొర్రాయి వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కొల్లాపుట్టు, కొర్రాయి పంచాయతీల్లో జరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్‌రావు, పి.లలిత, సర్పంచ్‌లు హరి, గుమ్మ నాగేశ్వరరావు, రామ్మూర్తి, మండల నాయకులు బాకా సింహాచలం, కృష్ణారావు, సోషల్ మీడియా ప్రతినిధి నరసింగరావు, మాజీ మండల అధ్యక్షుడు మల్లేష్, మండల కార్యదర్శి మఠం శంకర్, రామనాయుడు, గురునాయుడు, మాదల, బొండాం, సుంకరమెట్ట పంచాయతీల్లో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, అరకులోయ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామ్మూర్తి, పల్టాసింగ్ విజయ్‌కుమార్, ప్రకాష్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, కొర్రా సుమాంజలి, సర్పంచ్ దురి యా భాస్కరరావు, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్‌కుమార్, శత్రుఘ్న, రామచందర్, మాజీ మండల అధ్యక్షుడు కొర్రా గాసి, పార్టీ మండల కార్యదర్శులు కొర్రా అర్జున్‌రావు, కామేష్, మాజీ సర్పంచ్‌లు మోష్యా, ప్రసాద్, సన్యాసిరావు, నాయకులు నరసింహమూర్తి, సుక్రయ్య, అర్జున్ పాల్గొన్నారు.
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
ప్రైవేటీకరణతో వైద్య విద్య దూరం


