జలపాతం వద్ద ఐఏఎస్ అధికారుల సందడి
జి.మాడుగుల: మండలంలో కొత్తపల్లి జలపాతాన్ని పలువురు ఐఏఎస్ అధికారులు ఆదివారం సందర్శించారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి, జైపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సస్యరెడ్డి, జైపూర్ సబ్ కలెక్టర్ తదితరులు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన వ్యూపాయింట్ నుంచి జలపాతం సోయగాలు, ప్రకృతి అందాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కొండవాలు ప్రాంతం గుండా కింద జలపాతానికి కాలినడకన చేరుకుని కొద్ది సేపు సరదాగా గడిపారు.ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సెల్ఫీలతో ఉల్లాసంగా గడిపారు. కొత్తపల్లి జలపాతం సూపర్ వైజర్ వంతాల అభి,రాజు నిర్వాహకులు వారి వెంట ఉన్నారు.


