అధికారులు అప్రమత్తంగా ఉండాలి
చింతపల్లి: దీపావళి సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా మండలస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు. స్థానిక సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో ఆయన మండలపరిషత్, రెవెన్యూ, వైద్య శాఖ ల మండలస్థాయి అధికారులు, బాణసంచా దుకాణదారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ దీపావళి సందర్భంగా మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. చింతపల్లిలో నాలుగు బాణసంచా దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. దుకాణదారులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివ రించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఆనందరావు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ ఎన్.టి.రామారావు, సీఐ వినోద్‌బాబు,ఎస్‌ఐ వెంకటేశ్వర్లు,వైద్యాధికారులు పాల్గొన్నారు.


