
70 కిలోల గంజాయి పట్టివేత
డుంబ్రిగుడ: మండలకేంద్రం డుంబ్రిగుడలో శనివారం 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ కె.పాపినాయుడు తెలిపారు. స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒడిశా నుంచి ఆటోలో మైదాన ప్రాంతానికి తరలిస్తున్న గంజాయి పట్టుబడినట్టు చెప్పారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి ఆటోతో పాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన పాంగి లొబ్బొతో పాటు ముంచంగిపుట్టు మండలానికి చెందిన దురియ విజయ్, కొర్రా నీలకంఠంపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో సర్పంచ్ వెంకటరావు ఆధ్వర్యంలో పరివర్తన కార్యక్రమం నిర్వహించారు.
ముంచంగిపుట్టు: జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద శనివారం 45 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారంతో లబ్బూరు జంక్షన్ వద్ద తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఒడిశా వైపు వచ్చిన రెండు బైకులతో వచ్చిన వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. దీంతో చాకచాక్యంగా వ్యవహరించి, నలుగురిని పట్టుకున్నట్టు చెప్పారు. వారి వద్ద ఉన్న రెండు బస్తాలను తనిఖీ చేయగా గంజాయి బయటపడినట్టు తెలిపారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేయగా 45కిలోల470 గ్రాముల ఉందని,దీని విలువ రూ. 1.35 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పంపార్లమెట్ల పంచాయతీ నువడోలింబా గ్రామానికి చెందిన కంటెరి జలంధర్, డామా హంతల్, చింతలారి గ్రామానికి చెందిన పటి ఖారా, కొర్రాపుట్టు జిల్లా గంజైపాదర్ గ్రామానికి చెందిన గెన్ను హంతల్‌లుగా గుర్తించినట్టు తెలిపారు. వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించి, రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ రామకృష్ణ చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఏడుగురు అరెస్టు

70 కిలోల గంజాయి పట్టివేత