
పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమదానం
ముంచంగిపుట్టు: మండలంలోని కిలగాడ పంచాయతీ కేంద్రంలోని ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం శ్రమదానం చేశారు. పాఠశాల ఆవరణలో పరిసరాలు శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించారు. రాళ్లు, సిమెంట్‌ను సొంత నిధులతో సమకూర్చి పిల్లలు ఆడుకునే విధంగా ప్లాట్ ఫారం నిర్మించారు. తమ పిల్లలు చదువుకునే పాఠశాలలో తమ వంతంలో సహయంగా ప్లాట్ ఫారం నిర్మించామని, శ్రమదానం చేసి పరిసరాలు శుభ్రం చేయడం చాలా ఆనందంగా ఉందని వారు చెప్పారు. ప్రసుత్తం పాఠశాల చుట్టూ నిర్మించిన ప్రహారీకి ప్లాస్టింగ్ లేదని, ప్రభుత్వం అధికారులు స్పందించి ప్లాస్టింగ్‌కు నిధులు కేటాయించి, పూర్తి చేయాలని కోరారు. ఎస్‌ఎంసీ చైర్మన్ కె.నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు రాంప్రసాద్, కృష్ణమూర్తి, రమేష్‌పడాల్, నరసింహమూర్తి, రాంబాబు, రమేష్‌లు తదితరులు పాల్గొన్నారు. వారికి పాఠశాల హెచ్‌ఎం కె.బంగారయ్య, ఉపాధ్యాయులు సూర్యనారాయణ, బాబూరావు, సింహాచలం తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.