
ఇబ్బందులు తప్పేట్టు లేవు
ఇళ్లకు సంబంధించిన పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పరిహారం వచ్చేందుకు ఏపీజీవీబీ ఖాతాను ప్రభుత్వా నికి ఇచ్చాం. ప్రస్తుతం బ్యాంకు ఖాతా నంబర్లు మారుతాయని అధికారులు చెప్పడంతో ఇబ్బందులు తప్పేట్టు లేవు.
– పయ్యాల నాగేశ్వరరావు,
పోలవరం నిర్వాసితుడు, చింతూరు
సమస్యను పరిష్కరించాలి
ఏపీజీవీబీ బ్యాంకు ఖాతా నంబర్లు ఉన్నట్టుండి మార్చడం సరికాదు. దీని ప్రభావం నిర్వాసితుల పరిహారానికి సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశముంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలి.
– మొహమ్మద్ ఎజాజ్ అహ్మద్, చింతూరు
ఉన్నతాధికారుల దృష్టికి సమస్య
ఖాతా నంబర్ల మార్పు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. ఇప్పటికే ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్‌తో మాట్లాడా. సమస్యను పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వివరించాం.
– శుభం నొఖ్వాల్, ఐటీడీఏ పీవో, చింతూరు
ప్రస్తుతానికి ఇబ్బంది లేదు
ఏపీజీబీలో విలీనం వల్ల ఖాతా నంబర్లు మారనున్నాయి. ఇప్పటికే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మారగా ఈ ఏడాది డిసెంబరు అనంతరం ఖాతా నంబర్లు కూడా మారతాయి. అప్పటివరకు పాత నంబర్లలో లావాదేవీలు కొనసాగించవచ్చు.
– శ్రీనివాసరావు,
ఏపీజీబీ మేనేజర్, చింతూరు బ్రాంచ్

ఇబ్బందులు తప్పేట్టు లేవు

ఇబ్బందులు తప్పేట్టు లేవు