వైజాగ్‌ హాఫ్‌ మారథాన్‌కు భారీ స్పందన | - | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ హాఫ్‌ మారథాన్‌కు భారీ స్పందన

Oct 17 2025 6:04 AM | Updated on Oct 17 2025 6:04 AM

వైజాగ్‌ హాఫ్‌ మారథాన్‌కు భారీ స్పందన

వైజాగ్‌ హాఫ్‌ మారథాన్‌కు భారీ స్పందన

ఏయూ క్యాంపస్‌ (విశాఖ): వైజాగ్‌ ట్రైల్‌ రన్నింగ్‌ అసోసియేషన్‌.. వైజాగ్‌ హాఫ్‌ మారథాన్‌ 2025 బీచ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో 2 వేల మందికి పైగా పాల్గొన్నారు. మారథాన్‌లో హాఫ్‌ మారథాన్‌ (21.1 కి.మీ), 10 కి.మీ పరుగు, 5 కి.మీ ఫన్‌ రన్‌ ఉన్నాయి. ఆర్‌కే బీచ్‌ నుంచి రుషికొండ మీదుగా ఈ మారథాన్‌ను నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం కమిషనర్‌ రన్‌లో పాల్గొన్న వారిని అభినందించారు. డిసెంబర్‌ 6, 7 తేదీల్లో పాడేరులో 100 కిలోమీటర్లు రన్‌ కూడా పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు www.vtra.run వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement