
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఇద్దరు ఎంపిక
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిను లు పి. శ్రావణి సంధ్య, పి. మౌనిక యోగాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా.పి వసుధ తెలిపారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధి రాజమహేంద్రవరంలో ఈనెల 15న జరిగిన ఎంపికల్లో వీరిద్దరు ప్రతిభ కనబరిచారన్నారు. ఎస్‌వీవైఏఎస్‌ఏ యూనివర్సిటీ బెంగళూరులో వచ్చే 24 నుంచి 28 వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొంటారని వీరి పాల్గొంటారని తెలిపారు. ఇద్దరు విద్యార్థినులను గురువారం వైస్ ప్రిన్సిపాల్ డి.రవికుమార్, పీడీ ప్రభాకరరావు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.