
క్రమబద్ధీకరించకుంటే సమ్మె తప్పదు
జెన్ కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ ఒప్పంద కార్మికులు
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లోని పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఒప్పంద కార్మికులు డిమాండ్ చేశారు. లేకపోతే సమ్మె తప్పదన్నారు. ఈ మేరకు సోమవారం సీలేరు జెన్‌కో ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థల తరహాలో ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో పనిచేస్తున్న సుమారు 27,151 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈనెల 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సమ్మె చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అప్పర్ సీలేరు బ్రాంచ్ అధ్యక్షుడు బి.లక్ష్మణ్,కార్యదర్శి టి.విష్ణుకుమార్ జెన్‌కో, ట్రాన్స్‌కో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.