
విస్తారంగా వర్షాలు
పాడేరులో కురుస్తున్న వర్షం
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గెడ్డలు,వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో భారీ వర్షం కురవడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 267.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వై.రామవరంలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎటపాకలో 62.4, జీకే వీధిలో 39.2, రంపచోడవరంలో 26.8, కొయ్యూరులో 22, ముంచంగిపుట్టులో 9.4, మారేడుమిల్లిలో 7.4, అనంతగిరిలో 6.8, హుకుంపేటలో 6.6, రాజవొమ్మంగిలో 3.2, వి.ఆర్.పురంలో 2.4, చింతూరులో 2.2, డుంబ్రిగుడలో 2, కూనవరంలో 1.6, దేవిపట్నంలో 1.6, జి.మాడుగుల 1.4, పాడేరులో 1.2,అడ్డతీగలలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.