
నేటి నుంచి దేవీపురంలో దసరా బ్రహ్మోత్సవాలు
సబ్బవరం (అనకాపల్లి): ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దేవీపురంలోని శ్రీసహస్రాక్షి రాజరాజేశ్వరీదేవి ఆరాధన పీఠంలో దసరా బ్రహ్మోత్సవాలను ఈ నెల 22 నుండి వచ్చే నెల 7వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు గురుమాత అన్నపూర్ణమ్మ తెలిపారు. ప్రతిరోజు క్షీరాభిషేకం, కుంకుమార్చన, హోమం, మంత్ర జపం, పారాయణ, కళావాహన పూజలతో పాటు అలంకార సేవ, అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు దుర్గా సప్తశతి, లలితా సహస్ర నామావళి, ఖడ్గాది పంచదశ మాల–తిథి వారీగా స్తోత్ర పారాయణలు జరుగుతాయన్నారు. వచ్చే నెల 7న పౌర్ణమిని పురస్కరించుకుని సహస్రాక్షి దేవి అభిషేకం, దేవీ కల్యాణోత్సవం, ప్రతి రోజు ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.