
600 మందికి వైద్యసేవలు
వంద కిలోల
గంజాయి స్వాధీనం
● ఐదుగురి అరెస్టు
హుకుంపేట: వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ సన్యాసినాయుడు తెలిపారు. మండలంలో కొంతిలి వైపు నుంచి వస్తున్న కారును ఆదివారం తనిఖీ చేయగా వంద కిలోల గంజాయి బయటపడిందన్నారు. ఒడిశా నుంచి హుకుంపేట మీదుగా బెంగళూరు తరలించే క్రమంలో పట్టుబడిందని ఆయన పేర్కొన్నారు. గంజాయితో పాటు కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశాకు చెందిన ఒకరు, అల్లూరి జిల్లాకు చెందిన ముగ్గురు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.
రంపచోడవరం: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో సిరిగిందలపాడులో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ , క్యాంప్ ఇన్‌చార్జి స్వామి లోకమయనంద మహరాజ్‌లు రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. కార్పొరేట్ వైద్యులు కస్తూరి సుబ్రమణ్యం, శ్రీకృష్ణ పాతూరి, టీవీ సుబ్బారావు, పోతుల రామారావు, మణికంఠ, శ్రుతి తదితరులు, జీఎస్‌ఎల్ జనరల్ ఆస్పత్రి వైద్యులు 600 మందికి వైద్య సేవలు అందించారు. యోగానంద కంటి వైద్యశాల ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు భోజన సదుపాయం కల్పించారు.

600 మందికి వైద్యసేవలు