
మాచ్‌ఖండ్‌లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి
● వినియోగంలో అన్ని జనరేటర్లు
● 120 మెగావాట్ల ఉత్పాదన
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతోంది.గత కొన్ని నెలలుగా ప్రాజెక్టులో జనరేటర్లు సాంకేతిక లోపాలతో ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుకు ప్రాజెక్టు అధికారుల శ్రమకు తగిన ఫలితం వచ్చింది. ఈ నెల 11వ తేదీన 2,4,6 ,12న 1,3 జనరేటర్లును వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో 97 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగింది.గ త కొన్ని నెలలుగా పని చేయని ఐదో నంబరు జనరేటర్‌ను ఎట్టకేలకు 15వ తేదీన వినియోగంలోకి తీసుకువచ్చారు.దీంతో ప్రసుత్తం మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.శతశాతం విద్యుత్ ఉత్పత్తికి శ్రమించి,పని చేసిన ప్రాజెక్టు ఉద్యోగులు,కార్మికులకు ప్రాజెక్టు ఎస్‌ఈ ఏవీ.సుబ్రమణ్యేశ్వరరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కొంతకాలంగా పనిచేయని ఐదు నంబరు జనరేటర్‌ను ఇంజినీర్స్ డే రోజున వినియోగంలోకి తీసుకువచ్చిన అధికారులు, ప్రాజెక్ట్ సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు.