
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
పాడేరు : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఒకరోజు విధులను బహిష్కరించి గ్రామ సచివాలయ ఎదుట నల్ల రిబ్బన్లను ధరించి నిరసన తెలిపారు. రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలంలో రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలని, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లులకు ప్రమోషన్లు కల్పించాలని గ్రామ వలంటీర్ల ఇంటింటికి తిరిగి సర్వేలు లేకుండా చూడాలన్నారు. చివాలయం ఉద్యోగులందరికి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్‌తో ప్రమోషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లను సకాలంలో పరిష్కారించకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు.