
వృద్ధురాలిపై కోతుల దాడి
కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెంలో 70 సంవత్సరాల వృద్ధురాలిపై శనివారం సాయంత్రం కోతుల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రపాలెంలో ఇంటి వద్ద ఉన్న పీటా నారాయణమ్మపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. కోతులు వీపుపై కరచి గాయపరిచాయి. కాలిపైన, చేతులపైన కూడా కరిచాయి. దీంతో ఆమె భయంతో కేకలు వేయడంతో కొందరు వచ్చి వాటిని చెదరగొట్టారు. అప్పటికే కోతులు కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి బయట కూర్చుని ఉన్న తనపై ఒక్కసారిగా కోతులు వచ్చి దాడి చేశాయని చికిత్స పొందుతు న్న ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామంలో కోతుల సంఖ్య పెరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.