
విద్యుత్ షాక్‌తో గేదెలు మృతి
రాజవొమ్మంగి: స్థానిక ఎస్సీ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభం సమీపంలో మేస్తున్న రెండు గేదెలు షాక్‌కు గుర్తి అక్కడికక్కడే మృతి చెందాయి. స్తంభం నుంచి ఎర్త్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఈ సంఘటన జరిగినట్టు పలువురు చెప్పారు. గేదెలు మృతిచెందడంతో పాడిరైతు బొర్రా అప్పలరాజు బోరున విలపించారు. తాను జీవనాధారం కోల్పోయానని వాపోయారు. కాగా విద్యుత్ ఏఈ దొరబాబు, వెటర్నరీ సిబ్బంది వచ్చి వివరాలు సేకరించారు. విద్యుత్ సిబ్బంది ప్రమాదకరంగా ఉన్న వైర్లు తొలగించి సరి చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తనకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని స్థానికులు కోరారు.