
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు రాజవొమ్మంగి విద్యార్థులు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగిలోని 30 మంది ఏకలవ్య ( ఈఎంఆర్‌ఎస్ ) విద్యార్థులు గుంటూరులో జరగనున్న 4వ ఈఎంఆర్‌ఎస్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు (బాలుర విభాగం) శనివారం బయలుదేరి వెళ్లారు. గుంటూరులో 7, 8, 9 తేదీల్లో జరుగనున్న బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఆడతారని ప్రిన్సిపాల్ ఎం.వి.కృష్ణారావు తెలిపారు. నేషనల్ ఎడ్యూకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఢిల్లీ) ఆధ్వర్యంలో ఈ గేమ్స్ జరుగుతున్నాయన్నారు. ఇక్కడ గెలిచిన క్రీడాకారులను త్వరలో జరుగనున్న నేషనల్ లెవెల్ మీట్‌కు ఎంపిక అవుతారన్నారు. పీఈటీ సత్యనారాయణ విద్యార్థులతో ఉన్నారు.