
రైతులకు సూచనలు
జి.మాడుగుల: రైతులు తమ కాఫీ తోటలను బెర్రీ బోరర్ తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవాలని ఐటీడీఏ కాపీ ఫీల్డ్ ఆఫీసర్లు సీతారాం మజ్జి, జగదీష్ పాత్రుడు, సిబ్బంది వెంకట్, బాబూరావు కోరారు. మండలంలో గడుతూరు పంచాయతీ పచ్చనాపల్లి గ్రామంలో శనివారం కాఫీ రైతులకు బెర్రీ బోరర్ తెగుళ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెర్రీ బోరర్ తెగుళ్లు పొంచి ఉన్న ప్రమాదమని ఈ కీటకం కాఫీ పండ్లను వృత్తాకార రంధ్రం చేసి, గింజలను పూర్తిగా తొలచి తింటుందన్నారు. దీంతో పంటకు అపార నష్టం కలిగిస్తుందన్నారు. బెర్రీ బోరర్ తెగుళ్లను గమనిస్తే వెంటనే కాఫీ సిబ్బంది, కార్యాలయానికి తెలియజేయాలని వారు తెలిపారు.