పేదల గుండెల్లో వైఎస్‌ పదిలం | - | Sakshi
Sakshi News home page

పేదల గుండెల్లో వైఎస్‌ పదిలం

Sep 3 2025 4:19 AM | Updated on Sep 3 2025 4:19 AM

పేదల

పేదల గుండెల్లో వైఎస్‌ పదిలం

ఆదివాసీల ఆత్మబంధువు: ఎమ్మెల్సీ రవిబాబు

దేశానికి ఆదర్శంగా మహానేత పాలన

పాడేరులో వైఎస్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్య్లే భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సాక్షి,పాడేరు: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పేదవాడి గుండెల్లో మహానేత, దివంగత సీఎం డాక్టర్‌ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఆయన వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించారు. పాతబస్టాండ్‌లోని వైఎస్‌ విగ్రహనికి ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారని, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన మహానీయుడన్నారు. మహానేత వైఎస్సార్‌ ఆశయసాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అవిర్భవించిందని, ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు అమలుజేశారన్నారు.రానున్న 2029 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.

మహానేత పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి:

వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి

మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ తన పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలుజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లక్షల ఎకరాల భూములపై గిరిజనులకు సర్వహక్కులు కల్పించిన మహోన్నత సీఎంగా గిరిజనులు జీవితాంతం గుర్తుంచుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, వైస్‌ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి కూతంగి సూరిబాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, పాడేరు నియోజకవర్గ ఎస్టీసెల్‌ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, గ్రీవెన్స్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు దూసురు గంగరాజు,ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి,సల్లా చిట్టమ్మ,లకే రామకృష్ణపాత్రుడు,దూసురు సన్యాసిరావు,సర్పంచ్‌లు వంతాల రాంబాబు,సోమెలి లక్ష్మణరావు,గొల్లోరి నీలకంఠం,కుంతూరు బొంజుబాబు,వలంటీర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ము సురేష్‌బాబు,జిల్లా అధ్యక్షుడు కొమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

చిరస్థాయిగా వైఎస్‌ సంక్షేమం:

అరకు ఎంపీ తనూజరాణి

అరకులోయ టౌన్‌: మహానేత వైఎస్‌ మన మధ్య లేకపోయినా ఆయన అందించిన సంక్షేమ పథకాలు ప్రతీ గిరిజనుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అరకు ఎంపీ తనూజరాణి అన్నారు. మంగళవారం ఆయన వర్థంతిని అరకులోయ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధ్యక్షతన నిర్వహించారు. వైఎస్‌ విగహ్రానికి ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, అరకు, డుంబ్రిగుడ మండలాల వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన అన్ని పథకాలను ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారన్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధికారంలో లేకపోయినా కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, అక్రమాలను ప్రశ్నిస్తూ పోరాడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నకు సిఎం చేసేందుకు ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు.

సంక్షేమ సారధి వైఎస్‌: ఎమ్మెల్యే మత్స్యలింగం

సంక్షేము సారధి డాక్టర్‌ వైఎస్‌ అని ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. మైదాన ప్రాంతాలతోపాటు ఆదివాసీ ప్రాంతాల్లో వైఎస్సార్‌ చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు ఆయనకు మరువలేకపోతున్నారన్నారు. సొంతింటి కల నెరవేర్చిన మహానుభావుడు ఆయన అన్నారు.

ఆదివాసీల ఆత్మబంధువు వైఎస్‌ అని ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు అన్నారు. వారు సాగుచేసే 6లక్షల 26వేల ఎకరాల పోడు భూములకు మొట్టమొదటి సారిగా పట్టాలిచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎపిడమిక్‌ సీజన్‌లో తినడానికి తిండి లేక పీవీటీజీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్తే ఒక్కొక్క కుటుంబానికి 45కిలోల బియ్యం అందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఆదివాసీలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.

అనాథ పిల్లలకు భోజనాలు

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఎండపల్లివలసలోని నవజీవన్‌ నిరాశ్రిత పిల్లల సేవా కేంద్రంలోని 85 మందికి మంగళవారం మధ్యాహ్నం బలవర్ధకమైన పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి, ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు చిన్నారులకు భోజనాలు వడ్డించారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలని నిర్వాహకుడు జలంధర్‌కు సూచించారు. జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, జానకమ్మ, ఎంపీపీ బాక ఈశ్వరి, ఎంపీటీసీలు దురియా ఆనంద్‌ కుమార్‌, శత్రుఘ్న, రామచందర్‌, సర్పంచ్‌లు పాడి రమేష్‌ సుశ్మిత, రాధిక, బుటికి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్‌, పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గెడ్డం నర్సింగరావు, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్‌, వైస్‌ ఎంపీపీ కిల్లో రామన్న, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కమిడి అశోక్‌, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్‌ కుమార్‌, జి. ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

చిరస్మరణీయుడు..: మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి

రంపచోడవరం: దివంగత సీఎం వైఎస్‌ గిరిజనుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. రంపచోడవరం అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగిన వైఎస్సార్‌ వర్ధంతిలో ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టుల తెచ్చి గిరిజనుల భూములకు సాగు నీరు అందించిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. దేవీపట్నం ఇందుకూరుపేటలో జరిగిన వైఎస్సార్‌ వర్ధంతిలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొన్నారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీలు బందం శ్రీదేవి, కుంజం మురళీ, జెడ్పీటీసీలు పండా వెంటకలక్ష్మి, శిరసం కృష్ణవేణి, వైస్‌ ఎంపీపీ జి. మురళీ, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి,సర్పంచ్‌ మంగా బొజ్జయ్య పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు: మహానేత వైఎస్‌ పాలన దేఽశానికే ఆదర్శంగా నిలిచిందని, ఆయన ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. ఆయన వర్థంతి పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు అధ్యక్షతన మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఎంపీపీ అరిసెల సీతమ్మ, మండల వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్‌ వైఎస్సార్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక సీహెచ్‌సీలో రోగులకు, గర్భిణులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ భాగ్యవతి, సర్పంచ్‌లు రమేష్‌, నీలకంఠం, గంగాధర్‌, బాబూరావు, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, పార్వతమ్మ, వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్‌, సన్యాసిరావు, జిల్లా, మండల నేతలు జగబందు, రామ్మూర్తి, గాసిరావు, జయదేవ్‌, జేవీవీఎన్‌మూర్తి, కొండలరావు, వెంకట్‌, పులిరాజు, దాసు, సురేష్‌, తిరుపతి, అర్జున్‌, రాంప్రసాద్‌, బాలరాజు, జగన్నాథం పాల్గొన్నారు.

ఆయన ఆశయసాధనే లక్ష్యం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,

ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

జిల్లా వ్యాప్తంగా ఘనంగా

వైఎస్సార్‌ వర్ధంతి

నివాళులర్పించిన పార్టీ శ్రేణులు,

అభిమానులు

వాడవాడలా సేవా కార్యక్రమాలు

పేదల గుండెల్లో వైఎస్‌ పదిలం1
1/1

పేదల గుండెల్లో వైఎస్‌ పదిలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement