
వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి
అరకు ఎంపీ తనూజరాణి
హుకుంపేట: గిరిజన గ్రామాల్లో విడదల వారీగా వీధి దీపాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించామని అరకు ఎంపీ తనూజరాణి అన్నారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలో పర్యటించారు. తన ఎంపీ నిధులు సుమారు రూ.13.53లక్షలలో సమకూర్చిన 280 వీధి దీపాలను 33పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండవ విడతలో సోలార్ ఎల్‌ఈడీ దీపాలు అందిస్తామన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో సమస్యల పరిస్కారానికి కృషి చేస్తామన్నారు. ఎంపీపీ కూడా రాజుబాబు, ఎంపీడీవో రమాదేవి, ఏవో సన్యాసిరావు, వైస్ ఎంపీపీ గంజాయి సుశీల, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, మండల పార్టీ అధ్యక్షుడు పాంగి అనిల్ తదితరులు పాల్గొన్నారు.