
ఎరువులు అధిక ధరలకువిక్రయిస్తే చర్యలు
● విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్
రవికుమార్ హెచ్చరిక
చింతపల్లి: గిరిజన రైతులకు ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని విజలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన స్థానిక సీఐ వినోద్‌బాబుతో కలసి మండల కేంద్రంలోని మూడు ఎరువుల దుకాణాలను తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతాంగానికి విక్రయించే ఎరువులు, విత్తనాలకు విధిగా బిల్లులు ఇవ్వాలన్నారు.అదేవిధంగా కచ్చితంగా ఎమ్మార్పీకి మాత్ర మే విక్రయించాలని సూచించారు. నాసిరకం ఎరువులు, విత్తనాలను అమ్మితే దుకాణం లైసె న్సు రద్దు చేసి, కేసులు నమోదు చేస్తామన్నారు. ఎరువులకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మధుసూదనరావు పాల్గొన్నారు.