
మీడియేషన్ వన్ నేషన్‌ను ఉపయోగించుకోవాలి
అడ్డతీగల: మీడియేషన్ వన్ నేషన్ కార్యక్రమాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఎం.మురళీ గంగాధరరావు అన్నారు.మంగళవారం స్ధానిక కోర్టు వద్ద మీడియేషన్ స్టాల్ (మధ్యవర్తిత్వ కేంద్రం,న్యాయ సేవాసదన్)ను న్యాయమూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా కక్షిదారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వంతో కేసుల్లోని ఇరు వర్గాలు సామరస్యపూర్వకంగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి రాజీ చేసుకోవచ్చన్నారు.లోక్ అదాలత్‌లోనైతే ఒకరి అంగీకారంతోనే కేసు పరిష్కరిస్తారని, కానీ ఈ కార్యక్రమంలో ఇరు పార్టీలు అంగీకారానికి రావాలని తెలిపారు.కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ప్రయోజనాలు,లక్ష్యాలు వంటి అంశాలను వివరిస్తూ రూపొందించిన వాల్‌పోస్టర్లను న్యాయమూర్తి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కె.ఎన్.వి.రమణ,డి.శ్రీధర్,శ్రీనివాసరావు,ఇ.గౌరీశంకర్,గంగాధర్,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.