
అడవుల సంరక్షణతోనే జీవరాశుల మనుగడ
చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో అడవులు వ్యాప్తికి ఉపకరించే సమస్త జీవరాశిని కాపాడుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని గ్రీన్ క్‌లైమెట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం అన్నారు. మండలంలో తాజంగి సమీపంలో గల చెరువు ప్రాంతంలో ఉన్న పలు వృక్షాలు మీద జీవనం సాగిస్తున్న గబ్బిలాలు, ఇతర పక్షులను ఎన్‌జిఓల బృందం సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రాంతాలు నుంచ చెల్లా చెదురైన పక్షులు అక్కడక్కడ గూళ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయని,వాటి జీవనం దెబ్బతిన కుండా అవసరమైన పెద్దపెద్ద వృక్షాలను కాపాడాలన్నారు. సీఫా ట్రస్టు సీఈవో డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ సమస్త జీవరాశిని కాపాడాల్సిన బాద్యత మానవాళిపై ఉందన్నారు. అందుకే తమ సంస్థ మన్యంలో రహదారులు వెంబడి, కొండలమీద విత్తనాలు జల్లి అడవుల వ్యాప్తికి కృషి చేస్తున్నామన్నారు. నర్సింగ్, శ్రీనివాస్, రాజు, రాజేష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.