
రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు
అనంతగిరి(అరకులోయటౌన్): రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ మేరకు మండల పార్టీ అధ్యక్షుడు కొర్ర సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తుందన్నారు. మిథున్‌రెడ్డికి సంబంధం లేని లిక్కర్ కేసును బూచిగా చూపించి అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో బెల్టుషాపులను పెంచిపోషిస్తూ ప్రభుత్వ ఖజానాకి వెళ్లాల్సిన సొమ్మును కూటమి నాయకుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్నదొర, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, సర్పంచ్‌లు కొర్రా సింహాద్రి, జన్ని సన్యాసిరావు, పెంటమ్మ, ఎంపీటీసీ అశోక్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పాడి కృష్ణమూర్తి, నాయకులు శివాజీ, కృప, తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ అరాచక పాలన
కూనవరం: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, ఎంపీ పెద్దిరెడ్డి మిథురెడ్డిని రాజకీయ దుర్ధేశంతో అక్రమంగా అరెస్టు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగ జిల్లా అధ్యక్షుడు ఆవుల మరియాదాస్ అన్నారు. మండల పరిధిలోని టేకులబోరులో బీసీ సంఘం ముఖ్య నాయకుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని విస్మరించి, రాష్ట్రంలో రెబ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం కక్షాసాధింపులకు పాల్పడుతుందన్నారు. లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి రాజకీయంగా అరెస్టులు చేస్తున్నారని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీసీ సంఘాలు యావత్ ఈ చర్యను ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా ఆయకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు దీకొండ గంగాధరరావు, అరవా వెంకటరామారావు, కల్లం వీరాంజ నేయులు, చిముడుబోయిన శేఖర్, చామంతుల వెంకన్నా, మేడిది నాగేంద్ర, ఎండీ రహ్మతుల్లా పాల్గొన్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ
వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన

రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు