
కూటమిది అరాచక, అవినీతి పాలన
9 పేజీ తరువాయి
ముంచంగిపుట్టు: రాష్ట్రంలో కూటమి అరాచక,అవినీతి పాలన చేస్తోందని,ప్రజలను మోసం చేస్తూ,వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టి, అరెస్టులు చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.స్థానిక జెడ్పీ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడమేగాక ఒక అడుగు ముందుకేసి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ఇంటింటికీ బాండ్ల ఇచ్చారని, 2014లో లాగే ఈసారి కూడా బాబు ప్రజలను మోసం చేశారని తెలిపారు. ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వస్తే సంక్షేమ పథకాలపై నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ కూటమి సూపర్ సిక్స్ హామీలన్నీ మోసపూరితమైనవని,ప్రజలంతా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతలో ఉన్నారన్నారు. గ్రామాల్లో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించాలన్నారు. అర్హులకు పింఛన్లు నిలిపివేశారని, తల్లికి వందనం పథకం చాలా మంది విద్యార్థులకు వర్తించలేదని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క స్కూల్ కూడా మూతపడలేదని,నేడు కూటమి ప్రభుత్వ పాలనలో చాలా పాఠశాలలు తెరుచుకోలేదని చెప్పారు.నేటికీ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదని ఆమె ధ్వజమెత్తారు.అనంతరం పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఒక్క పథకం సక్రమంగా అమలుకావడం లేదన్నారు. ప్రజలను మోసగించడమే చంద్రబాబు నైజమని చెప్పారు. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం బాబు చేస్తున్న మోసాలకు సంబంధించిన క్యూర్ కోడ్ పోస్టర్‌ను ఎమ్మెల్యే మత్స్యలింగం,జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర,పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తదితరులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ,వైస్ ఎంపీపీ భాగ్యవతి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేష్,వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జగబంధు, కొండలరావు,వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు మత్స్యలింగం, గాసిరావు, రామ్మూర్తి, అప్పారావు, సర్పంచులు,ఎంపీటీసీలు,వైఎస్సార్‌సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర

కూటమిది అరాచక, అవినీతి పాలన

కూటమిది అరాచక, అవినీతి పాలన