
నాన్ బెయిలబుల్ వారెంట్ నిందితుడి అరెస్ట్
నర్సీపట్నం : పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు కేసుల్లో నాన్ బెయిల్‌బుల్ వారెంట్ కలిగిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని టౌన్ సీఐ జి.గోవిందరావు తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీ, శివపురానికి చెందిన కె.శివకుమార్‌పై వ్యక్తులపై దాడికి సంబంధించి క్రైమ్ నెంబరు 02/2016, 268/17, 223/2019 మూడు కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిని పాడేరులో అదుపులోకి తీసుకుని సోమవారం కోర్టులో హాజరు పరిచామన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అతనిని సబ్‌జైల్‌కు తరలించామని సీఐ తెలిపారు.