
పోగొట్టుకున్న కెమెరా అప్పగింత
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతం వద్ద పోగొట్టుకున్న రూ.లక్ష విలువ చేసే కెమెరాను జలపాతం నిర్వాహకులు... సందర్శకులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాదికొత్తగూడెం నుంచి కొంతమంది యువకులు ఆదివారం జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు.ఈ ప్రాంతంలో గల ప్రకృతి అందాలు ఆస్వాదించి, ఆనందంగా గడిపి తమతో తెచ్చిన రూ. లక్ష విలువ చేసే కెమెరా మరిచిపోయి వెళ్లిపోయారు. మార్గ మధ్యంలో కెమెరా విషయం గుర్తుకురావడంతో వారు కొత్తపల్లి జలపాతం వద్దకు చేరుకుని వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ విషయాన్ని జలపాత నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్వాహకులు జలపాతం పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా వెతకడంతో లభించిన ఆ కెమెరాను సందర్శకులకు అందజేశారు. దీంతో సందర్శకులు ఆనందం వ్యక్తం చేసి సూపర్‌వైజర్ అభికి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.