అప్పన్నను స్మరిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

అప్పన్నను స్మరిస్తూ..

Jul 10 2025 6:37 AM | Updated on Jul 10 2025 6:37 AM

అప్పన

అప్పన్నను స్మరిస్తూ..

అడుగులో అడుగేస్తూ..
సైడ్‌ లైట్స్‌

● గిరి ప్రదక్షిణ ప్రారంభించేందుకు ఉదయం 6 గంటల నుంచే భక్తులు సింహాచలం చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు రథోత్సవం ప్రారంభం సమయానికి తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్‌ వరకు ఇసుకేస్తే రాలనంతగా భక్తులు బీఆర్‌టీఎస్‌ రోడ్డులో కిక్కిరిశారు.

● ఉదయం 6 గంటలకే గిరి ప్రదక్షిణ ప్రారంభించిన పలువురు భక్తులు సాయంత్రానికే తిరిగి సింహాచలం చేరుకున్నారు. వారందరికీ రాత్రి 9 గంటల వరకు స్వామి దర్శనాలు అందజేశారు.

● సాయంత్రం 4 గంటల నుంచి తొలిపావంచా వద్ద భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

● తొలిపావంచా వద్దకు వెళ్లలేని భక్తులు రోడ్లపైన, బీఆర్‌టీఎస్‌ రోడ్డును ఆనుకుని ఏర్పాటుచేసిన గోడపైన కొబ్బరికాయలు కొట్టారు. దీంతో తొలిపావంచా వద్ద రోడ్డుపైనే కొబ్బరికాయచెక్కల కుప్ప పెద్ద ఎత్తున ఏర్పడింది.

● భక్తులు కొట్టిన కొబ్బరి చెక్కలు తరలించేందుకు క్రేనులు, లారీలు ఏర్పాటు చేశారు.

● భక్తులు రోడ్లపై కొబ్బరికాయలు కొట్టేయడంతో తొలిపావంచా వద్దకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

● దేవస్థానం బస్టాండ్‌లో పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వాళ్ల బంధువులు అక్కడికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.

● తొలిపావంచా ఎదురుగా మధ్యాహ్నం నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సులు పెద్ద ఎత్తున నిలపడంతో.. అక్కడకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

● పారిశుధ్య నిర్వాహణలో జీవీఎంసీ దారుణంగా విఫలమైంది. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు కొద్దిపాటి చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తిన జీవీఎంసీ సిబ్బంది.. సాయంత్రం భక్తుల రద్దీ పెరిగేసరికి చేతులెత్తేశారు. మేయర్‌, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడిక్కడే చెత్త పేరుకుపోయింది.

● 32 కిలోమీటర్లతో పాటు ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా మరో పది కిలో మీటర్లు అదనంగా నడిచిన భక్తులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు.

● గిరి ప్రదక్షిణలో మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలు తప్పిపోకుండా వారి చేతులకు ఏఐ ట్యాగ్‌లు వేశారు. గత ప్రభుత్వం హయాంలో ఈ విధానాన్ని అమలు చేయగా, ఈ ఏడాది కూడా అధికారులు కొనసాగించారు.

తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో పులివేషాలు, తప్పెటగుళ్లు, కేరళ డ్రమ్స్‌, కాళీ వేషాలు విశేషంగా అలరించాయి.

స్వచ్ఛంద సంస్థల సాయం

గిరి ప్రదక్షిణని పురస్కరించుకుని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. గిరిప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల కొండచుట్టూ 30 ప్రదేశాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 32 చోట్ల వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, రెండు సూపర్‌ స్పెషాల్టీ వైద్య బందాలు అందుబాటులో ఉంచి భక్తులకు వైద్య సేవలు, మందులు అందజేశారు. జీవీఎంసీ 109 ప్రదేశాల్లో 400 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతంలో తాగునీరు అందుబాటులో ఉంచింది. పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దారిపొడవునా స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహార పదార్థాలు, స్నాక్స్‌, పానియాలు అందజేశాయి.

32 కి.మీ కాదు.. 44 కి.మీ. నడిచారు

వీఐపీ, వీవీఐపీ వారిపై ఉన్న శ్రద్ధ సామాన్య భక్తులపై లేదంటూ పోలీసులపై, ప్రభుత్వంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలకు నేరుగా తొలి పావంచా వద్దకు అనుమతించి.. సామాన్య భక్తుల వాహనాలను మాత్రం ఐదారు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. దీంతో తొలిపావంచా వరకు నడిచి.. అక్కడి నుంచి 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి.. మళ్లీ వాహనాల కోసం ఐదారు కిలోమీటర్లు నడిచి.. వాహనాల వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. దీంతో దాదాపు 44 కిలోమీటర్లకు వరకు భక్తులు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

3వ పేజీ తరువాయి

అప్పన్నను స్మరిస్తూ..1
1/3

అప్పన్నను స్మరిస్తూ..

అప్పన్నను స్మరిస్తూ..2
2/3

అప్పన్నను స్మరిస్తూ..

అప్పన్నను స్మరిస్తూ..3
3/3

అప్పన్నను స్మరిస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement