మోతుగూడెం : చింతూరు మండలం గొందుగూడెం గ్రామానికి చెందిన కూర జయ(18) అనే గిరిజన బాలిక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు వివరాలను ఎస్‌ఐ సాదిక్ తెలిపారు. మృతురాలు రంపచోడవరంలో ఇంటర్ చదువుతుంది. మంగళవారం ఇంటికి వచ్చి ఉదయం 8 గంటల సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లి వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
దీనిపై తల్లిదండ్రులను విచారించగా చదువు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినట్టు తెలిపారని ఎస్‌ఐ పేర్కొన్నారు. మతృదేహాన్ని చింతూరు ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.