
ఇంటింటికీ కూటమి మోసాలు
అరకులోయ టౌన్: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి సర్కార్ అసమర్థపాలనను ప్రజలందరికీ తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. అరకు పట్టణంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో రూ.4 వేల పింఛను మినహా ఏఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రతీ గడపకు వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. జగనన్న ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు.. ప్రస్తుతం కూటమిలో జరిగిన నష్టాన్ని స్పష్టంగా వివరించాలన్నారు. ప్రతీ గడపకు వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి చంద్రబాబు మోసాలు తెలుసుకునేలా చేయాలని సూచించారు. కార్యకర్తలకు ఏసమస్య వచ్చినా తన దృష్టికి తీసుకు వస్తే పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభు త్వ పాలకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. జగనన్న పాలనకు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. తల్లికి వందనం అరకొరగా తల్లుల ఖాతాల్లో జమ చేశారన్నారు. నిరుద్యోగులకు
మిగతా 8వ పేజీలో
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం
అధ్యక్షతన పార్టీ సమావేశం
క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా
‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’
పోస్టర్ ఆవిష్కరణ
అసమర్థ పాలనను ప్రజలకు
వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు

ఇంటింటికీ కూటమి మోసాలు