
మహానేత వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించాలి
అరకులోయటౌన్: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంగళవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలని అరకులోయ ఎమ్మె ల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. నియోజక వర్గం పరిధిలోని ఆరు మండలాల్లో మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్నం అరకులోయలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.