
పూరిపాకలో పాఠశాల నిర్వహణ
● భవనం ఏర్పాటుకు చర్యలు ● ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశం
రంపచోడవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అధికారులను ఆదేశించారు. రంపచోడవరం సమీపంలోని బోర్నగూడెంలో జీపీఎస్ పాఠశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల భవనం బాగోలేకపోవడంతో పాకలో విద్యా బోధన జరుగుతుందని గ్రామస్తులు పీవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందించి పక్కా భవనంలో పాఠశాల నిర్వహించాలని హెచ్‌ఎంకు తెలిపారు. పాఠశాలకు పక్కా భవనం ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరగుతుందన్నారు.