విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఆర్థికసాయం
చింతపల్లి: మన్యంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక చేయూత అందిస్తామని నాబార్డ్ డీడీఎం గౌరీశంకర్ తెలిపారు. గురువారం ఆయన చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలను పరిశీలించారు. దీనిలో భాగంగా ఆయన చింతపల్లిలోని అరుణతార, సుగుణ స్వచ్ఛంద సంస్థల రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన భవిష్యత్‌లో ఎఫ్‌పీవోలు చేపట్టనున్న కార్యక్రమాలన్నాయన వారి నుంచి తెలుసుకున్నారు. భవిష్యత్తులో కొన్ని ఎఫ్‌పీవోలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి విలువ ఆధారిత ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, ఎగుమతులు అన్నీ ఒకే కేంద్రంగా చేయాలని సూచించారు. ఏజెన్సీలో లభించే కాఫీ, అల్లం, పసుపు, మిరియాలు, పిప్పలి తదితర వ్యవసాయ ఉత్పత్తులతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌పీవోల డైరెక్టర్లు శ్రీనివాసరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
నాబార్డ్ డీడీఎం గౌరీశంకర్
చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచన


