
నిర్లక్ష్యానికి నిదర్శనం
ముంచంగిపుట్టు: ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి తరలించే తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సుస్తీ చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సేవలు అందించిన తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఈ జబ్బు పట్టుకుంది. ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో గురువారం ఈ వాహనం స్టార్ట్ అవ్వకపోవడంతో.. బాలింత బంధువులు సాయం పట్టారు. వారు తోయడంతో అంబులెన్స్ స్టార్ట్ అయింది. ప్రతి రోజు తల్లీ బిడ్డ అంబులెన్స్ స్టార్ట్ చేసేందుకు ఇదే రకమైన ఇబ్బంది ఎదురవుతోంది.
తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు అనారోగ్యం