
కొత్తపూదేడులో సారా జోరు
రాజవొమ్మంగి: తమ గ్రామంలో నాటు సారా అరికట్టాలంటూ మండలంలోని లోదొడ్డి పంచాయతీ, కొత్తపూదేడు గ్రామానికి చెందిన గిరిజన మహిళలు జడ్డంగి ఎస్‌ఐ చిన్నబాబుకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. తాము 30 కిలోమీటర్ల దూరంలోని లోతట్టు అటవీప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చామని, తమ గోడు పట్టించుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో సారా ఏరులై ప్రవహిస్తోందని, రాత్రి అయ్యిందంటే సారా తాగి వచ్చిన ఇంట్లో నానా గొడవ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సారాకు డబ్బులు లేకపోతే రేషన్ కార్డులు తనఖా పెట్టే పరిస్థితికి దిగజారుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. సారా తాగి వచ్చి తమను భర్తలు నానా విధాలుగా వేధిస్తున్నారని, ఇల్లు గుల్ల చేస్తుండటం వల్ల రోజు గడవని పరిస్థితి నెలకొందని గ్రామానికి చెందిన గోము వసంతకుమారి, వంతల సింహాచలం వాపోయారు. ఇప్పటికై నా సారా తయారీ, అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని వారు విన్నవించారు.
అరికట్టాలని పోలీసులకు
గ్రామ మహిళలు వినతి