
రెండు బైక్‌లు ఢీ... ఒకరి మృతి
● ఇద్దరికి తీవ్రగాయాలు
రాజవొమ్మంగి : మండలంలోని కొమరాపురం వద్ద సోమవారం సాయంకాలం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనదారులు ఢీ కొనడంతో చికిలింత గ్రామానికి చెందిన పాకల లోవరాజు(40) సంఘటనా స్థలంలోనే మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న జడ్డంగికి చెందిన ముడుసు విజయ్‌కుమార్ (విలేకరి), చికిలింతకు చెందిన వీర్రాజును స్థానికులు 108 సహాయంతో జడ్డంగి పీహెచ్‌సీ తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చిన్నబాబు అన్నారు. లోవరాజు మృదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తున్నామని తెలిపారు.

రెండు బైక్‌లు ఢీ... ఒకరి మృతి