
ప్రశాంతంగా డి ప్లొమా లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష
మురళీనగర్ : ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (ఐటీఐ) పూర్తి చేసి బ్రిడ్జి కోర్సు చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో కోర్సు పూర్తి చేసిన 145 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ర్యాంకుల ఆధారంగా డిప్లమా రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు.