బైకు అదుపుతప్పిభార్యాభర్తలకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైకు అదుపుతప్పిభార్యాభర్తలకు గాయాలు

May 27 2025 12:50 AM | Updated on May 27 2025 12:50 AM

బైకు అదుపుతప్పిభార్యాభర్తలకు గాయాలు

బైకు అదుపుతప్పిభార్యాభర్తలకు గాయాలు

రంపచోడవరం : మారేడుమిల్లి మండలం గొర్రమామిడి గ్రామానికి చెందిన వీరపురెడ్డి, అతని భార్య విజయలక్ష్మి సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దేవీపట్నం మండలం దామనపల్లి నుంచి ఇంటికి వెళుతుండగా బైక్‌ అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికులు వారిని అంబులెన్స్‌లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఐ పోలవరం సమీపంలో ....:

రంపచోడవరం మండలం ఐ పోలవరం జంక్షన్‌ సమీపంలోని పాలకాలవ కల్వర్టు దాటిన తరువాత మలుపులో కారు, బైక్‌ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతింది. అలాగే బైక్‌ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బాధితుల వివరాలు తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement