
ఏయూ డిగ్రీ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
డాబాగార్డెన్స్(విశాఖ): ఏయూ డిగ్రీ ఫలితాల్లో ఆదిత్య కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ప్రకటించిన డిగ్రీ కోర్సు వివిధ విభాగాల్లో 1, 2, 3 ర్యాంక్‌లతో పాటు మొత్తం 12 ర్యాంకులు ఆదిత్య కై వసం చేసుకున్నారని చైర్మన్ డాక్టర్ ఎన్. శేషారెడ్డి తెలిపారు. బీసీఏ విభాగం నుంచి దున్నా ధనలక్ష్మి మొదటి ర్యాంకు, అమ్‌జూర్ పావని సెకండ్ ర్యాంక్, పెన్మత్స క్యాతిశ్రీ సెకండ్ ర్యాంకు, బొడుపు శిరీష థర్డ్ ర్యాంకు, గంగు రిపిక థర్డ్‌ర్యాంక్ (మొదటి మూడు ర్యాంకులు) ఆదిత్య విద్యార్థులు కై వసం చేసుకోగా, బీబీఏ విభాగం నుంచి కొరిపోలు మహిత సెకండ్ ర్యాంకు, వానపల్లి మౌనిక థర్డ్‌ర్యాంకు, గుండ్రు వెంకటసాయి కీర్తి థర్డ్‌ర్యాంకు సాధించగా, బీఎస్సీ విభాగం నుంచి మండల యమున ఫస్ట్ ర్యాంక్, సత్తి మోనిక విషాల్ థర్డ్ ర్యాంక్, బీకాం నుంచి పల్లేటి పల్లవి థర్డ్‌ర్యాంకు, ప్రిసింగ్ హరిప్రియ సెకండ్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. బీఎస్సీలో 2, బీకాంలో 2 ర్యాంకులు కై వసం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు విద్యార్థులను ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇ.ఎన్. ధనుంజయరావు అభినందించారు.