
ప్రధానార్చకుడిగాసీతారామాచార్యులకు పదోన్నతి
సింహాచలం(విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు–2గా కరి సీతారామాచార్యులు పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఉప ప్రధానార్చకులుగా ఉన్న ఆయన పురోహిత్ అలంకారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య సేవలు, ప్రముఖ ఉత్సవాల రోజుల్లో వైదికపరంగా సీతారామాచార్యులు సేవలు కీలకం. స్వామివారి ఉత్సవమూర్తుల వస్త్రాలంకరణలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితుడిగా పేరుప్రఖ్యాతులు గడించారు. ఆయన ప్రధానార్చకుడిగా పదోన్నతి పొందడంతో ఖాళీ అయిన ఉప ప్రధానార్చకుడి పోస్టును త్వరలో భర్తీచేయనున్నారు.